నాలుగో అంతస్తు నుండి కిందపడిపోయిన సీనియర్‌ నటుడు !

నాలుగో అంతస్తు నుండి కిందపడిపోయిన సీనియర్‌ నటుడు !

Published on Jul 1, 2018 10:54 AM IST

Chinmoy roi

బెంగాలీ సినీ పరిశ్రమలో పలు కళాత్మకమైన వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్‌ నటుడు చిన్మయ్‌ రాయ్‌, సౌత్ కోల్‌కతాలోని తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుండి ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన్ను తోటి స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే ఈ దురదృష్ట సంఘటన జరిగినప్పుడు చిన్మయ్‌ రాయ్‌ కుమారుడు ఇంట్లో లేరని తెలుస్తోంది. దాంతో ఆయనను హాస్పిటల్ కు తరలించడానికి కొంత ఆలస్యం అయిందట.

ప్రస్తుతం చిన్మయ్‌ రాయ్‌ తీవ్రగాయాల నుంచి కోలుకుంటున్నారని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చిన్మయ్‌ రాయ్‌ కుమారుడు శాంఖ్యా తండ్రి బాగోగులను దగ్గరఉండి చూసుకుంటున్నారు. చిన్మయ్‌ రాయ్‌ నటించిన చిత్రాల్లో బసంతా బిలాప్‌, చార్‌మూర్తి లాంటి అద్భుతమైన చిత్రాలు కూడా ఉన్నాయి ఇప్పటికే కొంతమంది బెంగాలీ ప్రముఖులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్మయ్‌ రాయ్‌ ను పరామర్శిస్తున్నారు.

తాజా వార్తలు