‘పెద్ది’ ట్రైలర్ తోనే ఆ షాకింగ్ ట్విస్ట్! ఆ పుకారు నిజమేనా?

‘పెద్ది’ ట్రైలర్ తోనే ఆ షాకింగ్ ట్విస్ట్! ఆ పుకారు నిజమేనా?

Published on May 19, 2026 8:59 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఒక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు అవైటెడ్ ట్రైలర్ ని విడుదల చేసుకుంది. అయితే ఈ ట్రైలర్ తోనే సినిమా తాలూకా షాకింగ్ ట్విస్ట్ ని కూడా చూపించారని అనుకోవచ్చు. ఈ సినిమాలో హీరో పాత్రపై ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ఉంటుంది అని ఓ టాక్ ఉంది.

ఇందులో హీరో రెండు కాళ్ళు కోల్పోతాడని ఉప్పెన తరహాలోనే బుచ్చిబాబు మరో షాకింగ్ ఎండింగ్ ని ప్లాన్ చేసినట్టు ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే దీనిని పూర్తిగా ట్రైలర్ లో రివీల్ చేయలేదు కానీ ట్రైలర్ లాస్ట్ బిట్ లో ‘పెద్ది మళ్ళీ తన కాళ్లతో వచ్చాడు’ అంటూ వచ్చిన ఇంగ్లీష్ డైలాగ్ సినిమాలో షాకింగ్ ట్విస్ట్ పైనే అన్నట్టు అనిపిస్తుంది. దీనితో సినిమాలో రామ్ చరణ్ పై ఒక హార్ట్ బ్రేకింగ్ సీన్ కోసం అంత సిద్ధంగా ఉంటేనే బెటర్ అని చెప్పాలి. ఒకవేళ అలాంటి సీన్ ఉంటే బుచ్చిబాబు ఎలా దీనిని హ్యాండిల్ చేసాడు అనేది కూడా చూడాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు