ఏఎంబి సినిమాస్ లో వరుణ్ కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ !

Published on Dec 6, 2018 11:29 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు , ఏషియన్ సినిమాస్ ల జాయింట్ వెంచర్ ‘ఏ ఎమ్ బి సినిమాస్’ ఇటీవల హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో గ్రాండ్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ మల్టీ ఫ్లెక్స్ ను సుమారు 80 కోట్ల తో నిర్మించారని టాక్. 1638 సీటింగ్ కెపాసిటీ తో 7స్క్రీన్స్ తో అందుబాటులోకి వచ్చిన ఈ మల్టీ ఫ్లెక్స్ ఇప్పటికే మంచి రివ్యూస్ ను తెచ్చుకుంటుంది.

ఇక ఈ మల్టీ ఫ్లెక్స్ ఒక ఈవెంట్ కు వేదిక కానుంది. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన స్పెస్ థ్రిల్లర్ ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’ చిత్రం యొక్క ట్రైలర్ ను డిసెంబర్ 9న ఉదయం 11 గంటలకు ఏఎంబి సినిమాస్ లో లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కు హీరో , హీరోయిన్లతో పాటు చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు కూడా హాజరుకానున్నారని సమాచారం.

లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం మంచి అంచనాల మధ్య డిసెంబర్ 21న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :