యుద్ధం ముగిసింది, అలియాతో చరణ్ రొమాన్స్ మొదలు

యుద్ధం ముగిసింది, అలియాతో చరణ్ రొమాన్స్ మొదలు

Published on Jul 6, 2019 10:22 PM IST

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” మూవీలో చరణ్ సరసన నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలో మొదలుకానున్న షెడ్యూలులో అలియా పాల్గొననుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాజమౌళి తిరిగి వచ్చిన వెంటనే చరణ్ అలియా కాంబినేషన్ లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. ఈ షెడ్యూలు ని రాజమౌళి పూణే, అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించనున్నారని సమాచారం.

ఇంతకు ముందు షెడ్యూల్ లో హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో చరణ్, తారక్ లపై యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. చరణ్ సీతారామ రాజు పాత్రలో కనిపిస్తుండగా, అలియా ఆయన జోడిగా సీత పాత్రలో కనిపిస్తుందట. ఈ మూవీ;లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” మూవీకి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు