తెలంగాణాలో థియేటర్ తలుపులు తెరుచుకుంటున్నాయ్.!

Published on Jun 16, 2021 8:00 am IST

ఎంత గొప్ప సినిమా ప్రేమికులకు అయినా, ఎంత పెద్ద సినిమాలు నేరుగా ఓటిటిలో విడుదల అయినా కూడా వారికి థియేటర్స్ లో ఇచ్చే కిక్ మరి ఇంకెక్కడా కూడా దక్కదనే చెబుతారు.. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అలాంటిది మరి. పెద్ద తెరపై చేసే ఎంజాయ్మెంట్ నే వేరే విధంగా ఉంటుంది. కానీ ఆ ఆనందానికి కరోనా అనే కంటికి కనిపించవు వైరస్ అడ్డుకట్ట వేస్తుంది అని కలలో కూడా ఎవరూ అనుకోని ఉండరు.

కానీ ఎట్టకేలకు మాత్రం ఓసారి థియేటర్స్ తెరవగలిగలిగాం. అలాగే మళ్ళీ కరోనా రెండో వేవ్ తర్వాత కూడా రెండో సారి తెలుగు రాష్ట్రాల్లో మొదటగా తెలంగాణాలో థియేటర్ తలుపులు తెరుచుకోడానికి రెడీగా ఉన్నాయి. వచ్చే జూలై 1 నుంచి తెలంగాణా వ్యాప్తంగా థియేటర్స్ తెరవడం కన్ఫర్మ్ అయ్యింది.

అప్పటి లానే కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే అనుమతులు రావడంతో అదే విధంగా తెలంగాణాలో ఎట్టకేలకు థియేటర్స్ లో మళ్ళీ సందడి నెలకొంది. అలాగే ఏపీ లో కూడా త్వరలోనే థియేటర్స్ తెరుచుకోనున్నట్టు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈసారి నుంచి అయినా థియేటర్స్ లో మాస్క్ లు తీయకుండా ఎంజాయ్ చేస్తే మూడో వేవ్ రాకుండా తగ్గించినవారు అవుతారు.. ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని చూస్తే అందరికీ మంచిదే..

సంబంధిత సమాచారం :