థియేటర్స్ బంద్.. ఇప్పటికైతే లేనట్టే!

థియేటర్స్ బంద్.. ఇప్పటికైతే లేనట్టే!

Published on May 21, 2025 9:04 PM IST

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి తలపెట్టిన థియేటర్ల బంద్‌ను వాయిదా వేశారు. ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై బుధవారం తెలుగు ఫిలిం ఛాంబర్‌ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయింది. ఈ సమావేశానికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు.

ఇక అటుపై సినీ నిర్మాతలతో తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు చాలా మంది సమ్మె లేకుండా సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో థియేటర్లు రన్ అవుతూనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

దీంతో జూన్ 1 నుంచి తలపెట్టిన థియేటర్ల మూసివేత ఇప్పటికైతే లేనట్టే అని తేలిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు