తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోనున్న థియేటర్లు

Published on Jul 5, 2021 2:44 pm IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం థియేటర్లు మూత బడిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటం తో థియేటర్లు మూసివేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల ప్రారంభం పై కీలక ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో జూలై 8 వ తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో థియేటర్లు తెరుచుకోనున్నాయి. అయితే అదే విధంగా తెలంగాణ రాష్ట్రం లో కూడా 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది.

అయితే థియేటర్ల పునః ప్రారంభం తో ఆయా సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలు త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్లు మూత బడి ఉండటం తో కొన్ని సినిమాల విడుదలలు వాయిదా పడగా, మరికొన్ని ఓటిటి బాట పట్టాయి. అయితే తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం తో దర్శక నిర్మాతలతో పాటుగా, అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :