అప్పుడు కొరటాల.. ఇప్పుడు బుచ్చిబాబు.. సేమ్ టు సేమ్..!

అప్పుడు కొరటాల.. ఇప్పుడు బుచ్చిబాబు.. సేమ్ టు సేమ్..!

Published on Jul 8, 2026 8:05 PM IST

ప్రస్తుతం సినిమాలు తీయడం అత్యంత కష్టతరంగా మారిపోయింది. ప్రతి చిత్రంతోనూ దర్శకులు తామేంటో నిరూపించుకోవాల్సిన ఒత్తిడి నెలకొంది. గతంలో ఎన్టీఆర్‌తో కొరటాల శివ తీసిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించింది. రొటీన్ కథే అయినప్పటికీ కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యింది. కానీ, ఆ సినిమా తర్వాత కొరటాలకు మరో ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఏ స్టార్ హీరో కూడా ఆయనతో సినిమా చేయడానికి ముందుకు రాకపోవడం ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టించింది.

​ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఎదుర్కొంటున్నాడు. తన రెండో సినిమాకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘పెద్ది’ లాంటి భారీ ప్రాజెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్‌గా ఓకే అనిపించుకున్నప్పటికీ.. ప్రేక్షకులు ఇప్పుడు సాధారణ మేకింగ్‌ను ఆదరించే స్థితిలో లేరు. రొటీన్ ఫార్ములాతో సాగిన బుచ్చిబాబు కథను క్రియేటివ్ లెవెల్‌లో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఫలితంగా చరణ్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసిన తర్వాత కూడా బుచ్చిబాబు చేతిలో ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ లేకుండా పోయింది.

​ఈ పరిణామాలను గమనిస్తే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతో పనిచేస్తున్న దర్శకులకు ఒక కొత్త సవాల్ ఎదురవుతున్నట్లు స్పష్టమవుతోంది. బాక్సాఫీస్ వద్ద సినిమాలు యావరేజ్‌గా ఆడినా, ఆ తర్వాత దర్శకులకు మాత్రం ఎలాంటి క్రెడిట్ లేదా కొత్త అవకాశాలు దక్కడం లేదు. కేవలం కమర్షియల్ హంగులు మాత్రమే నమ్ముకుంటే సరిపోదని, కథల్లో కొత్తదనం లేకపోతే ఎంతటి సీనియర్ దర్శకులనైనా ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తుందని ఈ పరిస్థితులు రుజువు చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు