‘సిరివెన్నెల’ను తలపిస్తున్న’నిశ్శబ్దం’ పాత్రలు…!

‘సిరివెన్నెల’ను తలపిస్తున్న’నిశ్శబ్దం’ పాత్రలు…!

Published on Oct 7, 2019 11:38 AM IST

Nishabdam1

అనుష్క, మాధవన్ లు ప్రధాన పాత్రలలో తెరెక్కుతున్న నిశ్శబ్దం చిత్రం నుండి నేడు మాధవన్ లుక్ ని రివీల్ చేశారు. పకృతి వడిలో శబ్దాలకు దూరంగా వైలిన్ వాయిస్తూ సంగీత సాధనలో మమేకమైనట్లున్న ఆయన లుక్ అలరించేదిగా ఉంది. అంధుడైన గొప్ప మ్యుజీషియన్ గా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. హేమంత్ మధుకర్ దర్శకత్వం దర్శకత్వంలో కళాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క మూగదైన పెయింట్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.

ఐతే నిశ్శబ్దం చిత్రంలో ప్రధాన పాత్రల తీరు చూస్తుంటే కళాతపస్వి విశ్వనాధ్ గారు 1986లో తెరకెక్కించిన సిరివెన్నెల చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో సుహాసిని మూగదైన పెయింటర్ పాత్ర చేయగా, సర్వదానం బెనర్జీ గుడ్డివాడైన గాయకుడి పాత్ర చేయడం జరిగింది. శారీరక లోపలున్న వీరిద్దరూ ఒకరి కళలను ఒకరు గౌరవించడం, వ్యక్తిత్వాలను ఆరాధించడం ప్రధాన కథగా సాగిన ఈ చిత్రంలో టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. కెవి మహదేవన్ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం తో జీవంపోసుకున్న పది పాటలు కలకాలం నిలిచిపోయాయి.

తాజా నిశ్శబ్ద్టం చిత్రంలో కూడా అనుష్క మూగదైన పెయింటర్ గా కనిపిస్తుండగా మాధవన్ అంధుడైన మ్యూజిషియన్ పాత్ర చేస్తున్నారు. దీనితో సిరివెన్నెల మరియు నిశ్శబ్దం చిత్రాల మధ్య పాత్రలలో పోలిక కనిపిస్తుంది.అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల ఇతర కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్ ఓ పాత్ర చేయడం విశేషం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు