“వకీల్ సాబ్” టీం నుంచి ఈ చాన్సులు తక్కువే.!

“వకీల్ సాబ్” టీం నుంచి ఈ చాన్సులు తక్కువే.!

Published on Aug 11, 2020 1:37 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల వచ్చిన బ్రేక్ తో ఆగిపోవాల్సి వచ్చింది. అంతకు ముందు వరకు మాత్రం ఈ చిత్ర యూనిట్ నుంచి కేవలం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఒక సాంగ్ మాత్రమే విడుదలయ్యాయి.

కానీ మధ్యలో ఎన్నో అకేషన్స్ వచ్చినా ఎలాంటి అప్డేట్స్ వారి నుంచి రాలేదు. కానీ ఈసారి మాత్రం ఆ చాన్సులు తక్కువే ఉన్నాయట. వచ్చే సెప్టెంబర్ 2 న పవన్ పుట్టిన రోజు కావడంతో “వకీల్ సాబ్” చిత్ర యూనిట్ నుంచి టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న బజ్. కానీ ఈసారి మాత్రం కన్ఫర్మే అన్నట్టు తెలుస్తుంది. దీనితో వకీల్ సాబ్ టీం నుంచి నో చెప్పడానికి ఛాన్స్ లు చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. దీనితో పవన్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 2 డేట్ ను లాక్ చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు