మెగాస్టార్ ఈ రీమేక్ పై అది గాలి వార్త మాత్రమే.!

Published on May 15, 2021 3:15 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. మరి ఇది ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోనుంది. ఇక దీని తర్వాత మెగాస్టార్ రెండు రీమేక్ చిత్రాలు కూడా లైన్ లో పెట్టుకున్నారు. వాటిలో మళయాళ బ్లాక్ బస్టర్ హిట్ “లూసిఫర్” రీమేక్ ఒకటి. దీనిపై కూడా మన దగ్గర భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజులు నుంచి ఇప్పటి వరకు ఓ రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఈ చిత్రానికి దర్శకుడు మోహన్ రాజా తప్పుకున్నారని టాక్ వచ్చింది. కానీ అసలు విషయంలోకి వెళ్తే అది ఒట్టి గాలి వార్తే అని అందులో ఎలాంటి నిజమూ లేదని కన్ఫర్మ్ అయ్యింది. సో ఈ మెగా రీమేక్ విషయంలో స్పీడ్ అవుతున్న ఆ రూమర్ పై ఎలాంటి నిజమూ లేదు.

సంబంధిత సమాచారం :