అల్లు అర్జున్ “పుష్ప”పై ఆ గాసిప్ లో నిజం లేదు.!

అల్లు అర్జున్ “పుష్ప”పై ఆ గాసిప్ లో నిజం లేదు.!

Published on Dec 20, 2020 10:00 AM IST

Pushpa
ప్ర్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “పుష్ప”. బన్నీ మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో దీనిపై అంతే స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో ఇప్పటికే పలు ఆన్ లొకేషన్ లీకులు అభిమానులను ఇబ్బందులు పెడుతున్నాయి.

వీటితో పాటుగా ఈ సినిమా విషయంలో అనేక గాసిప్స్ కూడా ఊపందుకున్నాయి. అలా లేటెస్ట్ గా వచ్చిన ఓ గాసిప్ ను బన్నీ టీం వారు కొట్టి పారేసారు. ఈ చిత్రంలో ఇప్పుడు పాట చిత్రీకరణ జరుగుతుందని టాక్ రాగా వాటిలో ఎలాంటి నిజమూ లేదని తెలుస్తుంది. మేకర్స్ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ నే తెరకెక్కిస్తున్నారు.

మరి ఇంకా ఏవ్ తీస్తూ ఉండచ్చేమో కానీ ప్రస్తుతానికి అయితే పాటల చిత్రీకరణ జరుగుతుందని వచ్చిన గాసిప్ లో ఎలాంటి నిజమూ లేదు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు