యంగ్ టైగర్ నుంచి ఈ ఛాన్సెస్ కూడా ఉన్నాయట.!

Published on May 18, 2021 11:25 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో ఓ భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం మరో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మరియు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లతో సాలిడ్ లైనప్ ను సెట్ చేసుకున్నాడు. అయితే తారక్ నుంచి ఇంకో రెండు రోజుల్లో తన పుట్టినరోజు సందర్భంగా “RRR” నుంచి భీం పోస్టర్ రావడం కన్ఫర్మ్ అయ్యింది.

దానిపై అధికారిక కన్ఫర్మేషన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనితో పాటుగా తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరటాలతో సినిమాపై కూడా ఏమన్నా చిన్నపాటి అప్డేట్ కూడా వచ్చే సూచనలు ఉన్నట్టు ఇపుడు టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అలాగే ఈ చిత్రంలో కియారా అద్వానీ ఫిక్స్ అయ్యినట్టుగా తెలిసింది. మరి ఆ రిలేటెడ్ అనౌన్సమెంట్ ఏమన్నా ఇస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :