ప్రభాస్ “సలార్” పై రెండు వెర్షన్లు వైరల్.!

Published on Jan 31, 2022 12:35 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంపై రీసెంట్ గానే ఒక ఊహించని సెన్సేషనల్ బజ్ ఒకటి బయటకి ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేసింది. అదే ఈ సినిమాకి కూడా బహుశా సీక్వెల్ ఉండొచ్చు అనే మాట..

అయితే ఆల్ మోస్ట్ సినీ వర్గాల్లో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని హాట్ టాపిక్ ఉండగా ఇక దీనిపైనే ఒక రెండు వెర్షన్ లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తారు అనేది జస్ట్ రూమర్ మాత్రమే అని ఒకటి. అలాగే లేదు ఒక్క భాగంగానే ప్రశాంత్ నీల్ తీస్తున్నాడని ఇదే ఫైనల్ అని మరికొన్ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ రెండు అంశాలు సలార్ పై ఇంట్రెస్టింగ్ గా మారాయి. మరి వేచి చూడాలి నిజంగానే సలార్ రెండు పార్ట్స్ గా వస్తుందా లేక సింగిల్ గానే వస్తుందా అనేది..

సంబంధిత సమాచారం :