అక్కడ ‘రజినీకాంత్’ తరువాత ‘రామ్ చరణే’ !

Published on Apr 29, 2019 12:18 am IST

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఇండియన్ హీరోల్లో మొదటి ప్లేస్ లో ఉంటారు సూపర్ స్టార్ రజినీకాంత్. ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అయితే జపాన్ లో ఎక్కువ అభిమానులను కలిగిన హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణే అంటా. అందుకు నిదర్శనం ఇటీవలే జపాన్ అభిమానుల నుండి రామ్ చరణ్ అందిన పుట్టిన రోజు కానుకలే అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేడుకగా వాదిస్తున్నారు. ఒక విధంగా ఈ వాదనలో నిజం లేకపోలేదు.

మెగా పవర్ స్టార్ కు ‘రంగస్థలం’ తరువాత విదేశాల్లోనూ ఫాలోయింగ్ విపరీతంగా పెరికిపోయింది. అందులో జపాన్ లో అయితే మరీనూ. ఇప్పటికే మెగా అభిమానులు మెగా హీరోల పుట్టిన రోజులకు పలుచోట్ల సేవాకార్యక్రమాలతో పాటు రక్త దాన శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువుగా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మీద జరుగుతాయి. మిగతా హీరోల అభిమానులు కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు గాని.. మెగా పవర్ స్టార్ కోసం మెగా ఫ్యాన్స్ అంతకన్నా భారీగా నిర్వహిస్తున్నారు.

మొత్తానికి జపాన్ లో ‘రజినీకాంత్’ తరువాత ‘రామ్ చరణే’ అనేంతలా చరణ్ క్రేజ్ పెరిగిందట. ఇక ప్రస్తుతం చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ లో అయిన గాయం నుండి కోలుకున్న చరణ్ మరో పది రోజుల్లో మళ్లీ షూట్ లో పాల్గొననున్నాడు.

సంబంధిత సమాచారం :