చిరు లూసిఫర్ డైరెక్టర్ పై ఆరోజు క్లారిటీ..?

Published on Aug 5, 2020 8:39 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఆచార్య చేస్తున్నారు. ఇప్పటికే 40శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ ఏడాదే ఆచార్య విడుదల కావల్సి ఉండగా లాక్ డౌన్ పరిస్థితుల వలన వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. ఈ మూవీ అనంతరం చిరు మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో చేయనున్నారు. ఈ చిత్ర దర్శకుడిగా యంగ్ డైరెక్టర్ సుజీత్ వ్యవహరిస్తున్నారు.

ఐతే కొంత కాలంగా టాలీవుడ్ లో ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. లూసిఫర్ రిమేక్ బాధ్యతలు డైరెక్టర్ వి వి వినాయక్ కి అప్పగించాలి అనేది చిరు ఆలోచన అట. అందుకే లూసిఫర్ రిమేక్ నుండి సుజీత్ ని తప్పించారని వార్తలు రావడం జరిగింది. ఐతే దీనిపై చిరు బర్త్ డే నాడు క్లారిటీ రానుంది. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు కానుకగా లూసిఫర్ మూవీ ప్రకటన ఉంటుందని, ఆరోజు దీనిపై స్పష్టత వస్తుందని సమాచారం. ఇక ఆచార్య మూవీ నుండి టీజర్ కూడా రానుందట.

సంబంధిత సమాచారం :

More