ఆహా లోకి మరో 15 సినిమాలు…లిస్ట్ ఇదే!

Published on Jul 1, 2021 6:12 pm IST

థియేటర్లు ఇంకా తెరుచుకొకపోవడం తో దర్శక నిర్మాతలు ఇటీవల ఓటిటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యం లో ఓటిటి ప్లాట్ లకు క్రేజ్ పెరిగి పోతుంది. అయితే ఇటీవల వచ్చిన ఆహా యాప్ తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అయితే ఈ యాప్ లోకి ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలను, షో లను, వెబ్ సిరీస్ లను యాజమాన్యం తీసుకు వస్తుంది. అయితే తాజాగా ఆహా లోకి 15 సినిమాలు ఈ శుక్రవారం నాడు రానున్నాయి. ఈ 15 సినిమాల్లో కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఆ లిస్ట్ ఎంతో ఇప్పుడు చూద్దాం.

యుద్ధం శరణం, అందాల రాక్షసి, దిక్కులు చూడకు రామయ్య, ఊహలు గుసగుసలాడే, ఈగ, బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం, చిరు నవ్వుతో, ఘటోత్కచుడు, కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, వినోదం, వేటగాడు, లీసా లతో పాటుగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, పొగరు చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఈ శుక్రవారం నాడు ఈ సినిమాలు వస్తుండటం తో అభిమానులు తమకు నచ్చిన సినిమా చూసేందుకు రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :