“ఘోస్ట్” లో ఈ యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోతాయి – నాగార్జున

Published on Oct 4, 2022 5:30 pm IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా సోనాల్ చౌహన్ ఫీమేల్ లీడ్ లో నటించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ది ఘోస్ట్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా ఈ చిత్రం రేపు దసరా కానుకగా అయితే థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఇక ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ అంతా కూడా ఇంటెన్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా లేటెస్ట్ గా నాగార్జున అయితే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేశారు.

సినిమా అంతా ఒక సాలిడ్ యాక్షన్ ప్యాక్ లా షాకిచ్చే విధంగా ఉంటుంది అని ముఖ్యంగా అయితే సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే చర్చ్ ఫైట్ సీక్వెల్ హైలైట్ గా నిలుస్తుంది అని కింగ్ నాగ్ లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో అయితే తెలిపారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే దర్శకుడు కూడా ఈ సినిమాలో ఏకంగా 12 యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని చెప్పారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :