“ఫ్యామిలీ మ్యాన్ 2” కి కొన్ని రిలీజ్ డేట్లు ఇవే.!

Published on May 13, 2021 8:30 am IST

ప్రస్తుతం మన ఇండియన్ డిజిటల్ రంగంలో అంతా ఎంతో ఆస్కతిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2”. ఎప్పటి నుంచో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎప్పుడో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల చేత మేకర్స్ ఈ సిరీస్ విడుదల వాయిదా వేశారు.

మరి అలా గత కొన్ని రోజులు కితమే ఈ సిరీస్ కు జూన్ లో ముహూర్తం కుదిరింది అని టాక్ బయటకు వచ్చింది. మరి ఇప్పుడు అదే టాక్ నిజం చేస్తూ కొన్ని డేట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ గా జూన్ 4 అని తెలుస్తుండగా 11వ తేదీ వైరల్ అవుతుండగా వీటితో పాటుగా జూన్ 14 కూడా వినిపిస్తుంది.

మరి ఈ మూడింటిలో ఏది ఖరారు అవుతుందో చూడాలి. మరి ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా వెర్సిటైల్ నటుడు మనోజ్ భాజ్ పై నటిస్తుండగా ఈసారి మెయిన్ వినాలి రోల్ లో స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని నటించింది. అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :