పవన్ బర్త్ డే స్పేస్ లో పాల్గొనే తారలు వీరే.!

Published on Sep 1, 2021 8:00 am IST


మన దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో హీరోలను ఆరాధించే విధంగా ఏ ఇండస్ట్రీ లో కూడా అభిమానులు తన హీరోల పట్ల చెయ్యరని చెప్పాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హీరోలకి వేరే లెవెల్లో ఉంటారు, తమ అభిమాన హీరోల పుట్టినరోజు వస్తే ఇంక వారికి జాతర అన్నట్టే.. అలా కొన్ని రోజులు కితం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు భారీ లెవెల్లో మహేష్ బర్త్ డే ని చేసుకోగా..

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వంతు వచ్చింది. మరి వీరి హంగామా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇక ఆన్ లైన్ కి వస్తే వీరు కూడా ఇటీవల పాపులర్ అయ్యిన ఒక ట్విట్టర్ స్పేస్ నిర్వహించడానికి రెడీ అయ్యారు. మరి ఈ స్పేస్ లో పాల్గొనడానికి పలువురు సినీ తారలు కూడా రెడీ అయ్యారు.

మరి వారిలో దర్శకులు బాబీ, క్రిష్, పవన్ వీరాభిమాని బండ్ల గణేష్, స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్, వకీల్ సాబ్ నటి అనన్య నాగళ్ళ, నటుడు బ్రహ్మాజీ, నీలిమ, సంజనా గల్రాని, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, వరుణ్ సందేశ్, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరియు సాహిత్య రచయిత భాస్కర భట్ల పాల్గొననున్నారు. ఈ స్పేస్ రేపు సెప్టెంబర్ 2న సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. మరి వీరంతా ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ని పంచుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :