పవన్, హరీష్ మాస్ ట్రీట్ అప్పుడేనేమో మరి.!

Published on Jun 10, 2021 7:05 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన మరో చిత్రం కూడా ఒకటి. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం కోసమే నిన్నటి నుంచి సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో రచ్చ లేస్తుంది. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ రివీల్ పై మేకర్స్ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు.

దీనితో ఆల్రెడీ సినిమా ఫస్ట్ లుక్ డిజైన్ మరియు టైటిల్ కూడా లాక్ అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఎప్పుడో ఉగాదికే విడుదల చెయ్యాల్సి ఉన్న ఫస్ట్ కోసం ఇపుడు మరింత ఆసక్తి నెలకొంది. అయితే భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ ఫస్ట్ లుక్ ఇక వచ్చే సెప్టెంబర్ లో పవన్ బర్త్ డే కానుకగానే రివీల్ చెయ్యడానికి ఆస్కారం ఉందని చెప్పాలి.

అయితే అంతకు ముందే మరో ఛాన్స్ కూడా ఉంది అనుకోవాలి.. ఈ చిత్రం ప్రీ లుక్ ని చూస్తే పవన్ మార్క్ దేశ భక్తి షేడ్స్ కూడా కనిపించాయి. మరి ఆ లెక్కన ఆగష్టు 15 కి కూడా మంచి ముహూర్తం ఉందని చెప్పుకోవచ్చు. మరి మేకర్స్, హరీష్ శంకర్ ఏం ఫిక్స్ అయ్యారు, ఎప్పుడు రివీల్ చేస్తారు అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :