“ఆదిపురుష్”లో వారు ఊహించని మేకోవర్ కి.!

Published on Apr 20, 2021 8:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టేర్ ప్రభాస్ తన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” ఫినిష్ చేసే పనిలో ఉన్న తెలిసిందే. ఇక దీనికి ముందు ప్రభాస్ మరో భారీ చిత్రం “ఆదిపురుష్” షూట్ లో కూడా పాల్గొన్నాడు. అయితే ఇది కూడా శరవేగంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు ఓంరౌత్ ఢిల్లీ టైమ్స్ లో లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా పలు ఆసక్తికర విషయాలనే వెల్లడించారు.

ఇది వరకే ఈ చిత్రంలో ప్రభాస్ మేకోవర్ పై టాక్ వినిపించింది. కానీ అంతకు మించిన స్థాయిలోనే ప్రభాస్ మేకోవర్ ఈ సినిమాలో ఉంటుందట. అంతే కాకుండా ప్రభాస్ తో పాటుగా ఈ చిత్రంలో రావణ పాత్ర చేస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు కూడా మాసివ్ మేకోవర్ ఈ చిత్రంలో కనిపిస్తుంది అని ఓంరౌత్ తెలిపాడు.

ఇప్పటికే ప్రభాస్ వి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఓంరౌత్ వారిపై ఎలాంటి మార్పులు చూపించనున్నాడో చూడాలి. మరి వీటితో పాటుగా ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ కూడా ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ భారీ మైథలాజికల్ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :