“రాధే శ్యామ్” కు ఈ డీలింగ్స్ నడుస్తున్నాయా.?

Published on May 11, 2021 7:01 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే ఒక బ్యూటిఫుల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆల్రెడీ సినిమా షూటింగ్ కంప్లీట్ కాబడినా ఇంకా కొన్ని రీ షూట్స్ బాకీ ఉండటంతో వాటిని కంప్లీట్ చేసే పనిలో మేకర్స్ పడ్డారు.

కానీ మళ్లీ ఊహించని విధంగా కరోనా రెండో వేవ్ వ్యాప్తి చెందుతుండడంతో కొన్ని పరిస్థితులు మారాయి. మరి ఈ క్రమంలోనే రాధే శ్యామ్ కు థియేట్రికల్ బిజినెస్ తో పాటుగా ఓటిటి పరంగా కూడా భారీ డీల్స్ వస్తున్నాయట. కానీ ఇంకా మేకర్స్ ఏది డిసైడ్ చెయ్యనట్టు తెలుస్తోంది.

ఇప్పటికే బాలీవుడ్ నుంచి పలు బడా చిత్రాలు స్ట్రీమింగ్ తో పాటుగా థియేట్రికల్ గా కూడా విడుదల అవుతున్నాయి. ఆ పరంగా రాధే శ్యామ్ కు డీల్స్ వస్తున్నాయట. కానీ వీటిపై మాత్రం అధికారిక క్లారిటీ రావాలి అంటే కొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :