“కేజీయఫ్ 2″కు అంత మొత్తం ఇచ్చుకోలేం అంటున్నారా.?

Published on Feb 7, 2021 2:00 pm IST

ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న పలు భారీ చిత్రాల లిస్ట్ తీస్తే అందులో కన్నడ సెన్సేషనల్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” తప్పక ఉంటుంది. చాప్టర్ 1 ఊహలకు అందని హిట్ కావడంతో చాప్టర్ పై కూడా అంతకు మించిన స్థాయి అంచనాలే నెలకొన్నాయి. అందుకే మేకర్స్ ఈ సమయాన్ని అసలు వదులుకునే పరిస్థితిలో లేరు. అందుకే ప్రతీ ఏరియా ప్రతీ రాష్ట్రంలో కూడా నెవర్ బిఫోర్ ఫిగర్స్ ను డీల్ చేస్తున్నారు.

మరి అలా ఓవర్సీస్ మార్కెట్ కు సంబంధించి కూడా కొన్ని రోజుల కితమే భారీ ఫిగర్ హాట్ టాపిక్ అయ్యింది. మరి ఆ టాక్ ప్రకారం ఓవర్సీస్ లో 80 కోట్ల మార్క్ ను వారు డిమాండ్ చెయ్యగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం అందుకు సుముఖంగా లేనట్టే తెలుస్తుంది. మరి ఇందుకు కారణం కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

చాప్టర్ 1 ఇండియా మొత్తంలో భారీ హిట్ అయ్యి ఇప్పుడు చాప్టర్ 2 కు హైప్ వచ్చినప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం ఆ రేంజ్ హైప్ కనిపించడం లేదని హైప్ అయితే ఉంది కానీ అది కేజీయఫ్ మేకర్స్ కోట్ చేస్తున్న ఫిగర్ ను మ్యాచ్ అవ్వడం కష్టమే ఏమో అని కాస్త డైలమాలో ఉన్నారట. మరి ఫైనల్ గా ఈ రేట్ ఎంతకు తెగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :