“పుష్ప 2” రిలీజ్ డేట్ పై కన్నేసిన చిత్రాలు ఇవే!

“పుష్ప 2” రిలీజ్ డేట్ పై కన్నేసిన చిత్రాలు ఇవే!

Published on Jun 19, 2024 3:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రం డిసెంబర్ నెల కి వాయిదా పడింది. ఈ చిత్రం ముందుగా ఆగస్ట్ 15, 2024 వ తేదీని టార్గెట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ డేట్ పై కొన్ని చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ ను ఇదే డేట్ కి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఫిక్స్ చేయడం జరిగింది.

అదే తేదీకి ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లక్కీ భాస్కర్ చిత్రం కూడా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం ప్రీ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే మరొక చిత్రం కూడా ఈ డేట్ ను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. గోపిచంద్ హీరోగా నటించిన విశ్వం కూడా ఇదే డేట్ కి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ లాంగ్ వీకెండ్ ను ఏ చిత్రాలు క్యాష్ చేసుకుంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు