పవన్, మహేష్ సినిమాలు ఒకేసారి బరిలోకి?

Published on Jul 7, 2021 2:42 pm IST

టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరి సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి కు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కి వచ్చే అవకాశం ఉన్న పవన్ రానా సినిమా అయ్యప్పనం కోషీయం రీమేక్ చిత్రం. ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్దం అయినట్లు తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాది వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్ 3 చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉండనుంది. అయితే మూడు భారీ చిత్రాలు సంక్రాంతి పండుగ కి సిద్దం కావడం తో ఈ సారి స్టార్స్ వార్ తప్పేలా లేదు.

సంబంధిత సమాచారం :