కొద్దిరోజుల వరకు చరణ్ నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు పుకార్లు రావడం జరిగింది. ఆచార్య తరువాత కొరటాల చరణ్ తో మూవీ చేస్తారని కథనాలు రావడం జరిగింది. ఐతే అనూహ్యంగా నిన్న కొరటాలతో బన్నీ తన 21వ చిత్రం ప్రకటించి షాక్ ఇచ్చారు. పుష్ప తరువాత బన్నీ చేయబోయేది కొరటాలతోనే అని క్లారిటీ వచ్చింది. ఐతే మరి ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ చేసే ప్రాజెక్ట్ ఏమిటీ అనే సందేహం మొదలైపోయింది.
కాగా గతంలో వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల వంటి దర్శకులు కూడా చరణ్ కి కథలు వినిపించిన వారి లిస్ట్ లో ఉన్నారు. దీనితో వీరిద్దరిలో ఒకరికి చరణ్ అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మహేష్ తో మూవి హోల్డ్ లో పడ్డాక వంశీ మరో హీరోతో మూవీ కమిట్ కాలేదు. ఇక భీష్మ ఇచ్చిన హిట్ తో మంచి జోష్ లో ఉన్న వెంకీ కుడుముల కూడా కొత్త సినిమా ప్రకటించలేదు. అలాగే సైరా తరువాత ఖాళీగా ఉన్న సురేంధర్ రెడ్డి కూడా స్టార్ హీరోల వేటలో ఉన్నారు. కాగా ఈ ముగ్గురిలో ఒకరితో చరణ్ తన నెక్స్ట్ మూవీ చేసే అవకాశం కలదు.


