ఎన్టీఆర్ జోడిగా వారిద్దరిలో ఒకరు..?

Published on Aug 2, 2020 9:06 am IST

ఎన్టీఆర్ తన 30వ చిత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రం కావడంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ 30వ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారని సమాచారం. త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు, ఈ చిత్ర క్యాస్టింగ్ ఎంపికలో ఉన్నారు. పొలిటికల్ నేపథ్యంలో త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

ఎన్టీఆర్ ప్రక్కన జోడిగా ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉండగా ఒకరిని బాలీవుడ్ నుండి దించాలి అనుకుంటున్నారు. కాగా త్రివిక్రమ్ దృష్టి ఇద్దరు హీరోయిన్స్ పై ఉందట. జాన్వీ కపూర్ లేదా కియారా అద్వానీ ని ఈ సినిమా కోసం తీసుకోవాలి అనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది. జాన్వీ కపూర్ ఆయన మొదటి ఛాయిస్ కాగా ఆమె చేయని పక్షంలో కియారాని తీసుకోవాలనుకుంటున్నారట. బాలీవుడ్ లో ఫార్మ్ లో ఉన్న కియారా ఎన్టీఆర్ ప్రక్కన ఇంత వరకు చేయలేదు. దీనితో కియారా కూడా బెస్ట్ ఛాయిస్ అని త్రివిక్రమ్ ఆలోచన.

సంబంధిత సమాచారం :

More