‘అఖండ’, ‘ఆచార్య’ నుంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న అప్డేట్స్.!

Published on Jun 20, 2021 10:39 am IST

మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో కూడా తాము చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ మంచి అంచనాలు సెట్ చేసుకొని ఉంది. మరి అలా మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ లు హీరోలుగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాలు “ఆచార్య” మరియు “అఖండ” లపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

మరి ఇరువురి ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ రెండు చిత్రాలు నుంచి మాత్రం గత కొంత కాలం నుంచి ఓ అప్డేట్ అలా మోస్ట్ అవైటెడ్ గా ఉండిపోయింది. మొదటగా అఖండ నుంచి థమన్ సమకూర్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ కోసం కాగా మరోటి ఆచార్య నుంచి చరణ్ మరియు పూజా హెగ్డే ల మధ్య మణిశర్మ డిజైన్ చేసిన బ్యూటిఫుల్ నెంబర్ కోసం.

ఈ రెండు చిత్రాల నుంచి ఆ రెండు పాటల కోసం ఎప్పటి నుంచో అభిమానులు సహా మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ సాంగ్స్ మంచి మోస్ట్ అవైటెడ్ గా నిలిచాయి. మరి మేకర్స్ ఈ బడా స్టార్స్ సినిమాల నుంచి ఆ అప్డేట్స్ ఎప్పుడు వదులుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :