శంకర్ – చరణ్ ప్రాజెక్ట్ పై ఇవి రూమర్సే..?

Published on Feb 28, 2021 8:07 pm IST

లేటెస్ట్ గా అనౌన్స్ కాబడిన భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ ల కాంబోలో ప్రకటించిన చిత్రం కూడా ఒకటి. అయితే ఈ బిగ్గెస్ట్ అండ్ ఊహించని కాంబో అనౌన్స్మెంట్ తోనే ఎనలేని హైప్ నెలకొంది. ఎటు నుంచి చూసినా మేకర్స్ కి ఇది ప్రిస్టేజియోస్ ప్రాజెక్టే కావడంతో దీనిపై ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది.

మరి అలా లేటెస్ట్ గాసిప్ ఒకటి దీనిపై వైరల్ అవుతుంది. అదే ఈ సినిమా బడ్జెట్ విషయంలో.. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి 150 కోట్లు ఫిక్స్ చేసారని టాక్ వైరల్ అవుతుంది. అయితే ఇవి జస్ట్ రూమర్లు మాత్రమే అని తెలుస్తోంది. అయినా ఈ కాంబోలో 150 అనేది చాలా చిన్న ఫిగర్ కూడా అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా బడ్జెట్ పై వినిపిస్తున్న వార్తలు అన్ని బూటకపు మాటలు మాత్రమే.. దీనికి ఇంకో థియరీ కూడా ఉంది.. శంకర్ ఈ చిత్రాన్ని ఒక స్కై ఫై థ్రిల్లర్ లా తీస్తారని టాక్ వచ్చింది సరే ఇది కాదు అనుకున్నా 2010లోనే శంకర్ సింపుల్ గా 180 కోట్లు ప్రాజెక్ట్ చేశారు.. సో ఈ ప్రిస్టేజియోస్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి బడ్జెట్ లెక్కలు సరైనవే కాదని అనుకోవాలి..

సంబంధిత సమాచారం :