OG ఎఫెక్ట్.. పవన్ పై గట్టిగా పడిందా! కొత్త వీడియోతో సర్ప్రైజ్

OG ఎఫెక్ట్.. పవన్ పై గట్టిగా పడిందా! కొత్త వీడియోతో సర్ప్రైజ్

Published on Jan 8, 2026 12:00 AM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రీసెంట్ హిట్ చిత్రమే “ఓజి” (They Call Him OG). తన కెరీర్ లోనే కాకుండా గత ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మరి ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సుజీత్ తన దగ్గరకి తీసుకెళ్లగా పవన్ ఈ సినిమా పట్ల చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్టు అప్పుడే కనిపించింది. అయితే ఓజి ఎఫెక్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ పై గట్టిగానే ఉన్నట్టు అర్ధం అవుతుంది.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి కొత్త అప్డేట్స్

ఇది వరకే తన నుంచి సెపరేట్ ప్రొడక్షన్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. సర్ధార్ గబ్బర్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఆరంభించి ఇప్పుడు మళ్ళీ కొత్త హ్యాండిల్ స్టార్ట్ చేశారు. అయితే ఇందులో మొదలు పెట్టడమే మార్షల్ ఆర్ట్స్ జర్నీతో షురూ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. అంతే కాకుండా ఏదో పెద్ద అంశమే చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఇందులో తెలిపారు.

Pawan Kalyan in Samurai mode – ఓజి ఎఫెక్ట్ తో సమురాయ్ మోడ్ లో పవన్

సుజీత్ తో చేసిన ‘ఓజి’లో పవన్ ని ఒక సమురాయ్ గా చూపించడం జరిగింది. పవన్ ఎప్పుడో చేసి వదిలేసిన మార్షల్ ఆర్ట్స్ ని సుజీత్ మళ్ళీ ప్రెజెంట్ చేయడం జరిగింది. మరి ఇదే తరుణంలో మార్షల్ ఆర్ట్స్ పై పవన్ కొత్త స్టెప్ తీసుకోవడం ఒకెత్తు అయితే లేటెస్ట్ గా వదిలిన వీడియోలో పవన్ తో పాటుగా మరికొందరు భారతీయులు కరాటే నుంచి సమురాయ్ లుగా మారినట్టు చూపిస్తున్నారు. అంతే కాకుండా ఇందులో పవన్ పై కూడా కొత్త లుక్ అండ్ గెటప్ తో కొన్ని విజువల్స్ కనిపించడం గమనార్హం.

తాజా వార్తలు