చిత్రలహరి నుండి మరోసాంగ్ విడుదలకానుంది !

Published on Mar 31, 2019 4:47 pm IST

సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటిస్తున్న ‘చిత్రలహరి’ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్లో వుంది. ఇక ఈచిత్రం నుండి ఇటీవల రెండు సాంగ్స్ విడుదలకాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి మరో సాంగ్ విడుదలకానుంది. ప్రేమ వెన్నల అంటూ సాగె ఈ సాంగ్ రేపు సాయంత్రం 4గంటలకు విడుదలకానుంది.

కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఏప్రిల్ 12న విడుదలకానున్న ఈ చిత్రం ఫై సాయి తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :

More