డివివి దానయ్య నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ‘భరత్ అనే నేను’. ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం నుండి ”వచ్చాడోయ్ సామి” పాట విడుదల కాబోతోంది.
ఈ నెల 7న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను భారీగా చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరుకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా లో ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ హీరో ఫాదర్ పాత్రలో కనిపించబోతున్నాడు.


