బాలయ్య నుంచి ఈ అనౌన్సమెంట్ డౌటేనా.?

Published on Jun 9, 2021 2:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ” నుంచి రానున్న మాస్ పోస్టర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు జూన్ 10 బాలయ్య బర్త్ డే కానుకగా ఆ చిత్ర యూనిట్ సంబరాలు కాస్త ముందే ప్లాన్ చేసేసారు. అయితే మరి రేపు మరిన్ని అప్డేట్స్ బాలయ్య నుంచి వస్తాయని కూడా టాక్ ఉంది. మరి వాటిలో బాలయ్య కొత్త సినిమాల అనౌన్సమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది.

అయితే వాటిలో స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ప్లాన్ చేసిన చిత్రం ఒకటి కాగా మరొకటి అనీల్ రావిపూడితో ప్లాన్ చేసిన చిత్రం ఉంది. అయితే వీటిలో గోపీచంద్ తో సినిమా ఓకే కానీ అనీల్ తో సినిమా అనౌన్సమెంట్ పై ఇంకా క్లారిటీ లేనట్టు తెలుస్తుంది. దీనితో ఈ సినిమా అనౌన్సమెంట్ ఉంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ సాలిడ్ కాంబోపై క్లారిటీ కోసం రేపటి వరకు వేచి ఉండక తప్పదు.

సంబంధిత సమాచారం :