బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఏప్రిల్ !

Published on Apr 20, 2019 3:00 am IST

ఈ ఏప్రిల్ ఎన్నికల హడావుడితో హీట్ ఎక్కించినా.. సినిమాల పరంగా మాత్రం బిగ్ రిలీఫే ఇచ్చింది. ఇండస్ట్రీకి తప్పనిసరిగా హిట్ కావాల్సిన పరిస్థితుల్లో.. అదేవిధంగా అంతకన్నా అత్యవసర హిట్ కావాల్సిన స్థితిలో ఉన్న ముగ్గురు హీరోలకునూ .. వాళ్ళ కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద మంచి ఎమోషనల్ హిట్స్ ఇచ్చింది ఈ ఏప్రిల్. ముందుగా మొదటి వారంలో మజిలీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య సూపర్ హిట్ అందుకుని, చాలా సంవత్సరాల తరువాత అక్కినేని అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు. అలాగే రెండో వారం చిత్రలహరితో వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఆరు పరాజయాల తరువాత.. ఒక సేఫ్ ప్రాజెక్ట్ చేశాడు. ఇప్పటికే చిత్రలహరి చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. మిగిలిన ఏరియాల్లో కూడా త్వరలో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ రోజు ‘జెర్సీ’తో వచ్చిన నాని క్లాసిక్ హిటే అందుకున్నంతగా సోషల్ మీడియాలో జెర్సీ గురించి హడావుడి నడుస్తోంది.

ఏమైనా సినిమా రంగానికి మాత్రం ఈ 2019 ఏప్రిల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఎఫ్ 2 తరువాత తెలుగు ఇండస్ట్రీకి చెప్పుకోతగ్గ హిటే లభించలేదు, ఆ మధ్యన వచ్చిన కళ్యాణ్ రామ్ 118 తప్పితే. మొత్తానికి ఈ నెలలో ఇప్పటివరకూ వచ్చిన మూడు సినిమాలు ఎమోషనల్ గా సాగుతూ.. ఆయా హీరోలకు ఎమోషనల్ హిట్స్ ఇవ్వడం విశేషమే. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కెరీర్ లో చైతు మరియు సాయి ధరమ్ తేజ్’ ప్లాప్ ల పరంపరలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే నాని కూడా గత రెండు సినిమాలు నుండి ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాడు.

ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఈ హీరోల సినిమాలు.. ఆ మాట కొస్తే చాలా కాలంగా సరైన హిట్ కోసం బాక్సాఫీస్ కూడా ఎదురు చూస్తోన్న సమయంలో.. వచ్చిన ఈ మూడు సినిమాలు మంచి హిట్ అయి.. హీరోల ప్లాప్ ల పరంపరకు బ్రేక్ వేశాయి. మొత్తానికి ఈ ఏప్రిల్ హీరోలతో పాటు ప్రేక్షకులకు కూడా బిగ్ రిలీఫే ఇచ్చింది.

సంబంధిత సమాచారం :