ఈసారి సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీతో మహేష్ సరికొత్తగా రానున్నారు. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ ఆర్మీ మేజర్ రోల్ చేస్తుండగా ఆయన పాత్రపై ఇండస్ట్రీలో ఆసక్తి కర చర్చ నడుస్తుంది. హీరోల మేనరిజం విభిన్నంగా చూపించడంలో పట్టు కలిగిన దర్శకుడు అని రావిపూడి మహేష్ ఆటిట్యూడ్ మరియు మేనరిజం సరికొత్తగా డిజైన్ చేశారట. ముఖ్యంగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కర్నూల్ వేదికగా వచ్చే సన్నివేశాలలో ఆయన ఆటిట్యూడ్ డిఫరెంట్ గా మరియు ఫ్యాన్స్ కి కిక్కు ఇచ్చేదిలా ఉంటుందట.
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక రోల్ చేస్తున్న ఈ చిత్రాన్ని రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు . రష్మిక మందాన మొదటి సారి మహేష్ కి జంటగా నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


