“పుష్ప”లో ఇంట్రెస్టింగ్ గా మారనున్న ఈ అంశం.!

Published on Mar 23, 2021 7:04 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గానే మళయాళ టాలెంటెడ్ మరియు అవార్డు విన్నింగ్ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడని కన్ఫర్మ్ అయ్యింది. సరే ఇది బాగానే ఉంది కానీ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ కోణం కోసం చర్చించుకోవాలి.

ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పుష్ప రాజ్ రోల్ లో కనిపిస్తున్న బన్నీ ఎర్ర చందనం దుంగల స్మగ్లర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. సో సిస్టమ్ ను వ్యతిరేకంగా పని చేస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ విలన్ షేడ్స్ లేదా యాంటీ హీరో షేడ్స్ లో కనిపించడం కన్ఫర్మ్ అనుకోవచ్చు. మరి అలాంటి పాత్రకు విలన్ గా ఇంకో పాత్రను సృష్టించడం ఇంకా ఆసక్తి కలిగించే అంశం. మరి దీనిని సుకుమార్ ఎలా డీల్ చేస్తారో అన్నది తెలియాలి అంటే ఆగష్టు 13 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :