బిగ్ బాస్ : ఇండియన్ ట్రెండ్స్ లో ఎలిమినేషన్ పై ఈ కంటెస్టెంట్ పేరు.!

Published on May 3, 2022 4:30 pm IST

ప్రపంచ వ్యాప్యంగా కూడా ఎంతో ఆదరణ ఉన్నటువంటి మోస్ట్ ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం అందరికీ తెలిసిందే. అలాగే మన తెలుగులో కూడా ఈ షోకి భారీ క్రేజ్ ఉంది. అందుకే తెలుగులో కేవలం స్మాల్ స్క్రీన్ పైనే కాకుండా ఓటిటి లో కూడా ఫస్ట్ సీజన్ ని తీసుకొచ్చారు. ఇక ఇది కూడా ఇప్పుడు మంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. కొత్త కొత్త ఎంట్రీ లు ఎలిమినేషన్స్ తో 70 రోజులు దాటేసింది.

ఇదంతా బాగానే ఉంది కానీ గతంలో టీవిలో ప్రసారం అయ్యినపుడు పలువురు కంటెస్టెంట్స్ పేర్లు ట్విట్టర్ ట్రెండ్స్ కనిపించాయి. అయితే ఈసారి ఓ కంటెస్టెంట్ పేరు మాత్రం ఎలిమినేట్ చెయ్యాలని ట్యాగ్ ఏకంగా ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు ప్రముఖ నటి బింధు మాధవి. ఈమెని ఎలిమినేట్ చెయ్యాలని ఎందుకో ఈ ట్యాగ్ ఆకస్మికంగా ట్రెండ్ అవుతుంది. మరి ఈ వారం ఈమెనే ఎలిమినేట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :