ఈ బయోపిక్ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందట !

ఈ బయోపిక్ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందట !

Published on Jul 17, 2018 6:57 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల హావా నడుస్తోంది. వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ లో నాని నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘టైగర్ నాగేశ్వర్ రావు’ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని, 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని అలాంటి భయానిక గజదొంగ పాత్రలో నటించి మెప్పించడం అంటే నిజంగా ఛాలెంజే.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం నాని ఈ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ పాత్ర కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోనున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను ఇప్పటికే చిత్రబృందం మొదలు పెట్టిందట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయిందని చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ అందించిన మాటలు సినిమాకే హైలెట్ నిలుస్తాయట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు