లేటెస్ట్..”కాంతారా 2″ లో ఈ బాలీవుడ్ నటి.?

Published on Feb 11, 2023 4:00 pm IST

కన్నడ సినిమా నుంచి గత ఏడాది వచ్చి పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో నటుడు రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ డివోషనల్ హిట్ “కాంతారా” కూడా ఒకటి. మరి కన్నడ సహా తెలుగు మరియు హిందీ భాషల్లో అద్భుతమైన ఆదరణతో చెరగని హిట్స్ లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. మరి ఈ సినిమాకి పార్ట్ 2 ని కూడా రిషబ్ మరియు చిత్ర నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు కూడా కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అయినటివంటి ఊర్వశి రౌటేలా కూడా ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆమె తన ఇన్స్టా వేదికగా నటుడు రిషబ్ శెట్టి తో కలిసి ఉన్న ఫోటో పెట్టి కాంతారా 2 పై పోస్ట్ చేసింది. మరి ఈ సినిమాలో ఈమె ఉందో లేక రిషబ్ ని కలిసినందుకు పోస్ట్ పెట్టిందో అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :