వైరల్ : చరణ్ తో డేటింగ్ కావాలి అంటున్న బాలీవుడ్ హీరోయిన్.!

Published on Jun 1, 2022 9:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోలా మారాడు. తనదైన సినిమాలతో అంతకంతకు మంచి క్రేజ్ పెంచుకుంటూ వెళ్తున్న చరణ్ రీసెంట్ గా అయితే తన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” లో తన స్టన్నింగ్ లుక్స్ తో మంచి లేడీ ఫాలోయింగ్ ని ముఖ్యంగా నార్త్ లో సంపాదించుకున్నాడు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరోయిన్ కం మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. చరణ్ పై మాట్లాడుతూ ఒకవేళ గాని చరణ్ కి ఇంకా పెళ్లి కాకుండా ఉన్నట్టయితే అతడితో డేట్ చేసేదాన్ని అని కామెంట్ చేసింది. మరి ఈ లెక్కన చరణ్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ప్రస్తుతం అయితే రామ్ చరణ్ శంకర్ తో భారీ సినిమా చేస్తుండగా మానుషీ నటించిన చిత్రం “పృథ్వీ రాజ్” రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :