ప్రభాస్ మరో భారీ చిత్రానికి ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.?

Published on May 1, 2021 10:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఆల్రెడీ చేస్తున్న సినిమాలు నాలుగున్నయి. వాటిలో ఆల్రెడీ మూడు సెట్స్ మీద కూడా ఉన్నాయి. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన భారీ పాన్ వరల్డ్ చిత్రం కూడా ఈ ఏడాది దీవాళీ కానుకగా మొదలు కానుందని తెలిసింది. అయితే ఈ చిత్రం అనంతరం కూడా ప్రభాస్ సాలిడ్ లైనప్ తో ఉన్నాడని టాక్ బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

అదే బాలీవుడ్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో.. ఈ కాంబోలో సినిమా ఉందని ఎప్పటి నుంచో టాక్ ఉంది. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కు జోడిగా నటించే హీరోయిన్ కోసమే ఇప్పుడు బజ్ మొదలయ్యింది. ప్రస్తుతానికి అయితే ఈ రేస్ లో అక్కడి స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పేరు వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజమో కాలమే నిర్ణయించాలి. ఆల్రెడీ ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్స్ “సాహో” కి శ్రద్దా కపూర్ ఇప్పుడు “ఆదిపురుష్” కి కృతి సనన్ లతో నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :