ప్రస్తుతం మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా రామ్ దీన్ని డిజైన్ చేసుకున్నాడు. రోజుల తరబడి గ్యాప్ లేకుండా వరుస షూట్ తో కొనసాగిస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు కనిపిస్తారు అనేది తెలుస్తోంది.
ఈ సినిమాలో విలన్ రోల్ కోసం మొదట కోలీవుడ్ నటుడు ఎస్ జే సూర్యని సంప్రదించారు అట. కానీ బేరసారాలు తెగకపోవడంతో ఈ రోల్ బాలీవుడ్ నటుడు, ప్రముఖ నటి జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సో రామ్ ని ఢీ కొట్టే విలన్ గా ఈ నటుడు కనిపిస్తాడు అని చెప్పొచ్చు.
ఇది వరకు రామ్, జెనీలియా కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఆమె భర్త రామ్ కి విలన్ గా కనిపించనున్నాడు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ త్వరలోనే రానుంది. ఇక ఈ చిత్రానికి రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ బరిలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


