ఇంకో కొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగిసిపోనుంది. అయితే నిన్నటి ఎపిసోడ్ తో ఫైనల్స్ రేస్ లో నిలిచిన మరో కంటెస్టెంట్ గా సోహెల్ నిలిచాడు. దీనితో ఇంకా మిగిలిన నలుగురిలో ఎలిమినేషన్ పట్ల మరింత టైట్ వాతావరణం ఏర్పడింది. మరి ఈ విషయంలోనే ఇంకా లోతుగా వెళ్లినట్టయితే అభిజీత్ ఎలాగో సేఫ్ జోన్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. సో ప్రస్తుతం మిగిలిన ఫీమేల్ కంటెస్టెంట్స్ లోనే ఎవరైనా బయటకు వెళ్లాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే నిన్న జరిగిన ఎపిసోడ్ ను చూస్తే అరియానాకు డేంజర్ బెల్స్ గట్టిగానే మోగినట్టు కనిపించాయి. కానీ ఆమె కూడా ఎలిమినేషన్ లో లేదని తెలుస్తుంది. మరి మిగిలి ఉన్న హారికా మోనాల్ లలో మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోనున్నట్టుగా లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. మోనాల్ ఇప్పటి వరకు ఎందుకు ఉందో అని అందరికీ ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్నే సో ఇప్పుడు వారికి సమాధానం దొరికిందో లేదో ఈ రోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.


