చరణ్ లైనప్ లో ఈ క్రేజీ దర్శకుడు కూడానా?

Published on Jun 9, 2021 5:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం అనంతరం చరణ్ శంకర్ తో అలాగే మరో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఉందని తెలిసింది. అయితే మరి ఇప్పుడు ఈ ఇద్దరూ కాకుండా మరో క్రేజీ కాంబోతో ఓ తమిళ దర్శకుడు చరణ్ లైనప్ లోకి వచ్చాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అతడు మరెవరో కాదు. “ఖైదీ”, “మాస్టర్” చిత్రాలతో తెలుగులో మంచి ఇంపాక్ట్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్. నీల్ తో సినిమా అయ్యాక వీరి కాంబో నుంచి సినిమా ఉంటుంది అని టాక్ ఇపుడు ప్రచారం అవుతుంది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఈ టాలెంటెడ్ దర్శకుడి నుంచి టాలీవుడ్ లో ఓ సినిమా ఉంటుందని ఎపుడో టాక్ వినిపించింది. మరి అది చరణ్ తోనేనా కాదా అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :