మహేష్ కు తమ లైన్ వినిపించిన ఈ టాలెంటెడ్ దర్శకులు.?

Published on May 16, 2021 12:39 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత త్రివిక్రం, అనీల్ రావిపూడి అలాగే ఎస్ ఎస్ రాజమౌళి లాంటి దర్శకులతో హిస్టారికల్ లైనప్ ను సెట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మహేష్ లైనప్ లోకి మరో ఊహించని సాలిడ్ డైరెక్షన్ కాంబో రానున్నట్టు తెలుస్తుంది.

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ అండ్ బిగ్ హిట్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్” దర్శకులు రాజ్ అండ్ డీకే లు మహేష్ కు ఓ లైన్, తమ ఆలోచనలు వినిపించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అన్నీ సెట్టయితే మాత్రం ఈ అదిరే కాంబో నుంచి అదిరే సినిమా పడటం పక్కా అని చెప్పాలి. మొత్తానికి మాత్రం ఈ ఎగ్జైటింగ్ కాంబోపై కన్ఫర్మేషన్ అనేది కాలమే డిసైడ్ చెయ్యాలి. మరి దీనికోసం కొన్నాళ్ళు వెయిట్ చెయ్యక తప్పదు.

సంబంధిత సమాచారం :