“ఆచార్య” లో ఆ భారీ సీక్వెన్స్ ను ఇలా తెరకెక్కిస్తున్నారా.?

Published on Apr 25, 2021 4:26 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నాడని వచ్చిన వార్త తర్వాత ఈ సినిమా అంచనాలు మరో లెవెల్ కి వెళ్లాయి.

అయితే చరణ్ ఉండేది కాసేపు అయినా తెరపై విధ్వంసం మాత్రం కొరటాల గట్టిగానే ప్లాన్ చేసారని తెలిసింది. అలా ధర్మస్థలి సెట్స్ లో ఓ రైన్ ఫైట్ ను ప్లాన్ చేసారని ఆల్రెడీ తెలిసిన విషయమే కానీ దానిని పగలు వ్యూ లో కాకుండా రాత్రి వ్యూలో తెరకెక్కిస్తున్నారని నయా గాసిప్.

ఆల్రెడీ కొరటాల మరియు చరణ్ ల కెరీర్ లో సాలిడ్ రైన్ ఫైట్ సీక్వెన్స్ లు ఉన్నాయి. మరి ఇద్దరి కలయికలో ఎలాంటిది ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. మరి ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :