ఈ క్రెడిట్ మాత్రం “వకీల్ సాబ్” దర్శకుడికే పోతుందా.?

Published on Jan 15, 2021 5:38 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దాదాపు మూడేళ్ళ తర్వాత కం బ్యాక్ ఇస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించారు. మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే మోస్ట్ అవైటెడ్ టీజర్ ను విడుదల చేశారు. మరి దీనికి ఇప్పుడు భారీ రెస్పాన్స్ వస్తుంది.

అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టీజర్ ను చూసి చాలా మేర ఫ్యాన్స్ అలాగే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కోసం తెలిసిన వారికి దర్శకుడు శ్రీరామ్ వేణు షాకిచ్చాడనే చెప్పాలి. అలాగే దిల్ రాజు కూడా ఈ సినిమాను పవన్ కు తగ్గట్టుగా చాలానే మార్పులు చేర్పులు చేస్తున్నామని తెలిపారు. మరి అది ఏ రేంజ్ లో ఉందో టీజర్ చూసి ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

నిజానికి ఈ కథ ఒక విమెన్ ఓరియెంటెడ్ ఎమోషనల్ డ్రామా కానీ దానికి పవర్ స్టార్ మ్యాజిక్ ను ఓ రేంజ్ లో యాడ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది మాత్రం పూర్తిగా దర్శకుని పనితనమే అని చెప్పాలి. ఆ మధ్య తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలానే మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పవన్ ఫ్యాన్స్ కు అనుగుణంగా మార్పులు చేసానని తెలిపారు. కానీ అవి ఈ రేంజ్ లో ఉంటాయని పవన్ ఫ్యాన్స్ అయితే ఊహించలేదు. ముఖ్యంగా పవన్ యాటిట్యూడ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

అలాగే సినిమాలో మార్పులు చేసిన దాని ప్రకారం మొత్తం మూడు ఫైట్ సీక్వెన్స్ లు డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే పవన్ ను మూడు రకాల వేరియేషన్స్ లో చూపించడం తన మార్క్ తో ఈ టీజర్ లో కనిపించేసరికి సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని భావిస్తున్నారు. మరి ఇవన్నీ తన “వకీల్ సాబ్”ను దర్శకుడు శ్రీరామ్ వేణు కొత్తగానే చూపించడం గ్యారంటీ అనేలా ఉన్నాయి. సో ఈ క్రెడిట్ మాత్రం శ్రీరామ్ వెనుకే వెళ్తుంది.

సంబంధిత సమాచారం :