“సర్కారు వారి పాట”కి అక్కడ డీల్స్ నడుస్తున్నాయట.!

“సర్కారు వారి పాట”కి అక్కడ డీల్స్ నడుస్తున్నాయట.!

Published on May 31, 2021 10:12 PM IST

sarkaru vaari paata

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ పెట్ల ఎండ్ ఎనర్జిటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మరి ఇప్పటికి కేవలం ఒక్క షెడ్యూల్ ని మాత్రమే పూర్తి చేసుకున్న ఈ చిత్రం అప్పుడే భారీ స్థాయి బిజినెస్ జరుపుకుంటుందని టాక్ వినిపిస్తుంది.

అయితే గత కొన్నాళ్ల కితమే ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులపై బజ్ రాగా ఇప్పుడు థియేట్రికల్ హక్కులకు సంబంధించి బజ్ వినిపిస్తుంది. మహేష్ కి సూపర్ స్ట్రాంగ్ అయినటువంటి ఓవర్సీస్ బిజినెస్ పై డీల్స్ నడుస్తున్నాయని సినీ వర్గాలలో టాక్. ఈ చిత్రానికి గాను మేకర్స్ దగ్గరగా 13 కోట్లు అలా ఫిగర్ కోట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ డీల్ ఇంకా కంప్లీట్ అయ్యిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు