“కేజీయఫ్ 2″లో ఈ ఫ్యాక్టర్ ఇంకా స్ట్రాంగ్ గా అట.!

Published on Jul 13, 2021 6:04 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ “కేజీయఫ్ 2” అనే భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రెడీ అయ్యిన ఈ చిత్రం విడుదల ఎప్పుడు ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ భారీ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ కూడా నీల్ దట్టించిన సంగతి తెలిసిందే.

అయితే ఫస్ట్ పార్ట్ లో ఎమోషన్స్ ను నీల్ అద్భుతంగా చూపించాడో ఈసారి చాప్టర్ 2 లో అంతకు మించే చూపనున్నట్టు టీజర్ తో అర్ధం అయ్యింది. అయితే ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ తో కూడా మదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా అత్యంత కీలక పాత్ర పోషించాయి. రాకీ రోల్ ని సినిమా మొత్తంలో కూడా వెంటాడే ఏకైక ఎమోషన్ అదే..

మరి ఇదే ఫ్యాక్టర్ చాప్టర్ 2 లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందట. లేటెస్ట్ టాక్ ప్రకారం నీల్ మొదటి పార్ట్ కంటే ఎక్కువ ఎమోషన్ కలిగిన సన్నివేశాలు అలాగే స్ట్రాంగ్ ఎలివేషన్ సీన్స్ అంటే ఒక కింగ్ మేకర్ గా రాకీ ఎలా ఎదగగలుగుతాడో అనే టైప్ సన్నివేశాలు ఉండనున్నట్టు తెలుస్తుంది. ఓ రకంగా ఫస్ట్ పార్ట్ హిట్ కావడానికి సెంటిమెంట్ కూడా చాలా దోహదపడింది. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :